Thursday, December 4, 2014

నా మంచు 'ముత్యం' నువ్వే కదా..

శుభోదయం రా  బుజ్జి తల్లి ( నా గారాల పట్టి)... 


ఈ రోజు ఉదయాన్నే లేచాను , ప్రకృతి అందాలను ఆస్వాదించి చాలా రోజులు అయ్యింది(అంటే వేరే అందాలను ఆస్వాదించడంలో కొంచెం బిజీ గా ఉన్నాలే ;) ) కదా అని నేనేదో అలా మంచులో వాకింగ్ కి వెళ్తే అక్కడ కూడా నా మనసుకి కష్టాలే... 


ఇంతకి నాకు వచ్చిన కష్టం ఏంటి అంటే నీ ఊహలే నన్ను ఆ పొగ మంచుల్లో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి...
మంచులో అలా నడుస్తూ ఉంటే, వేసే ప్రతి అడుగులో నువ్వే గుర్తుకువస్తున్నావ్ రా పిచ్చి... 



మంచు ముసుగు

అంతటి మంచులో నా శరీరంలో కలుగుతున్న చల్లదనం కన్నా, నిన్ను నా మనసులో ఊహించుకోవడం వల్ల కలిగిన వెచ్చదనమే చాలా హాయిగా ఉంది , చలి లో చలిమంట కాచుకున్నట్లుగా ... అలా మంచుదారుల్లో నడిచా, నీ ఊహలే శ్వాసగా మంచు ముత్యం లాంటి నీ మనసే నాకు తోడుగా ..!


నీ ఉహలతో ఉలిక్కిపడిన హృదయాన్ని ఓదార్చేలోపే తెలవారి పోయింది ఈ ఉదయం... అప్పుడు అనిపించింది జీవితం ఒక విచిత్రం లాంటిది అని...


మరొక విషయం ఏంటి అంటే ఈరోజు నా అలారం కన్నా నేనే ముందు లేచానోచ్చ్.. ఏంటి ఈ విషయం కూడా ఇప్పుడు నాకు చెప్పాలా అని నీకు అనిపించవచ్చు , కాని ఇలాంటి చిన్న చిన్న ఆనందాలని కూడా మిస్ చేసుకోకూడదు కదా...


MISS YOU MY DEAR.


Tuesday, December 2, 2014

నా సర్వస్వం నువ్వే....


నా సర్వస్వం నువ్వే, నేను గడిపే ప్రతి క్షణం నువ్వే గుర్తొస్తావు,

నేను చేసే ప్రతి పనిలో నువ్వే కనిపిస్తావు,

నా మనసులో నీపై ఆకాశమంత ప్రేమ,

నాకు అమ్మంటే ఎంత ప్రేమనో ... నువ్వంటే కూడా అంతే ప్రేమ 


I LOVE YOU SWEET HEART.....


అది నీకు బయటకు కనపడక పోవొచ్చు..నీ దగ్గర ఉన్నంత సంతోషంగా ఎవరితోనూ లేను...




నా సర్వస్వం నువ్వే....

నేను నీ ముందు నడుస్తున్నపుడు,

నిన్ను రక్షిస్తుంటాను.


నేను నీ ప్రక్కన ఉన్నపుడు,

నీ కొసం ఉంటాను.


నేను నీ వెనుక ఉన్నపుడు,

నిన్ను గమనిస్తూ ఉంటాను.


నేను ఒంటరిగా ఉన్నపుడు,

నీ కోసమే ఆలోచిస్తుంటాను.


నా మధిలో నువ్వే, నా ఆలోచనలో నువ్వే, నా ప్రాణం నువ్వే, నా సర్వస్వం నువ్వే...

Monday, November 3, 2014

శ్రీమతి ఇచ్చిన ఓ బహుమతి


ప్రతి ఒక్కరు జీవితం లో వారు అందుకున్న బహుమానలను ఎవరితోనయినా షేర్ చేసుకోవాలి అనుకుంటారు... నేను కూడ అంతే... 

 

చాలా మందికి బహుమానాలు వాళ్ళు ఎవైనా సాదింఛినప్పుడు వస్తాయి .. అప్పుడు అందరు వాళ్ళని మెచ్చుకుంటారు ..కాని నా జీవితం లో ఉంగరం నా చేతికి వచ్చిన తీరే వేరు... 

 

 

విలువైన ఉంగరం



అసలు విషయం ఏంటి అంటే పైన పెట్టిన ఫొటో నా శ్రీమతి (అదే నా గారల పట్టీ ) నాకు ఇచ్చిన ఓ అద్భుతమైన కానుక... 

లావణ్య నా భార్య కావడం నా జీవితం లో అతి పెద్ద అదృష్టం(ఉంగరం ఇచ్చింది అని మాత్రం కాదండోయ్)...
నా అభిరుచిని తెలుసుకుని నా భార్యామణి ఇచ్చిన ఈ గిఫ్ట్ నాకు ఎంతో అమూల్యమైనది... 

 

అసలు కిక్కంతా ఆ SL లోనే ఉంది!

 

నా కళ్ళు మూసి, నా చేతి వేలుకు ఉంగరం తొడిగి (నిశ్చితార్ధం రోజులా), ఇప్పుడు కళ్ళు తెరువు అని చెప్పి, ఉంగరం చూపిస్తూ నా కళ్ళ లో కళ్ళుపెట్టి చూస్తూ "నచ్చిందా" అని నువ్వు నన్ను అడిగినప్పుడు పట్టరాని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయి,కళ్ళు అప్పగించి చూస్తూ ఆ ఆనందంలో అలా స్థాణువులా ఉండిపోయా...


ఇప్పుడు ఇక్కడ ఇలా రాస్తున్నానే కాని ఆ క్షణం లో మాత్రం మొట్టమొదటిసారి నాకు మాటలు కరువయ్యాయి...

Friday, October 31, 2014

చూడాలని ఉంది నిన్ను... చేరాలని ఉంది నిన్ను...


చాలా రోజుల తర్వాత ఎందుకో  బ్లాగ్ ఓపెన్ చేయాలి అనిపించింది... బహుశా దానికి కారణం ఒంటరిగా ఫీల్ అవ్వడమేమో ... ఈ ఒంటరితనంని పక్కన లావణ్య ఉంటే గాని తీరదు...


శుక్రవారం సాయంత్రం అంటే అదొక ఆనందపు సమయము.. ఎందుకంటే లావణ్యను కలవడానికి,తనతో ఉండడానికి బెంగళూరు నుండి నేను బయలుదేరు సమయము కనుక. కాని ఈ శుక్రవారం సాయంత్రం అలా లేదు... తనని చాలా మిస్ అవుతున్నాను.. అసలు భోజనం కూడా చేయాలి అని లేదు...




కళ్ళు మూసుకుని పడుకుని ఉదయ్యాన్నే లేగిసే లోపు నా కళ్ళ ముందు నువ్వు  ఉంటే బాగుండు అనిపిస్తుంది...
మళ్లీ నిన్ను ఎప్పడు కలుస్తానా అన్న ఆత్రుత, ప్రతిక్షణం నీతోనే ఉంటు , ప్రతి నిమిషం నీతోనే మాట్లాడుతూ, ప్రతిసారి నీ కౌగిళ్ళలో కరిగిపోవాలి అని ఆశపడే  నా మనసుకి ఈ సారి నిరాశే మిగిలింది... 


ఇప్పుడు ఇక్కడ కురుస్తున్న వర్షం ఎక్కడి మేఘానిదో తెలియదు కానీ నా గుండెలో నిశ్శబ్దంగా కురుస్తున్న ఈ వాన మాత్రం నీదే(నీ కోసమే)..

Monday, October 20, 2014

నీ చేతి వంట అమృతమే..


‘ఇరుకైన’ ఈ వంట గది(నా హృదయపు) లో .. నువ్వు చూపించిన ఆప్యాయతకు(రుచి) చోటేది ప్రియా .

 

వంట చేయడమనేది ఒకకళ, మన సంస్కృతి. అగ్ని ముందే నిలబడి గంటలు తరబడి వంటలు  చేయడం ఒక యజ్ఞం లాంటిది. ఆ యజ్ఞమ్ ని పూర్తి చేసి, నా మనసును దోచుకున్నావ్ గా... !!!

 

కూరగాయలు తరగాలంటే నెయిల్ పాలిష్ ఊడిపోతుంది,  నీళ్లల్లో ఎక్కువసేపు పని చేస్తే  నా చేతులు మృదువుగా ఉండవు, స్టవ్ దగ్గర ఎక్కువ సేపుంటే ఆ వేడికి నా ముఖ చర్మం కమిలిపోయి పాడయిపోతుంది అని ఆలోచించే అమ్మాయిలు ఉన్న ఈరోజుల్లో ఇలాంటివి ఏవి ఆలోచించకుండా నా ఇష్టాలను, మనసుని  తెలుసుకుని నీ ప్రేమనీ, మమతనీ రంగరించి వండిన నీ  చేతి వంట నాకొక  ప్రత్యేకం, అపురూపం. మంచి వంటలు ఉంటాయి, గొప్ప వంటలుంటాయి కానీ కమ్మటి వంట మాత్రం ఖచ్చితంగా నీ  చేతి వంటే.

 
నా భార్య స్వయంగా తయారు చేసింది

లావణ్య చేసిన  రక రకాల  వంటకాలు అంటే పూరిలు, మైసూరు బోండాలు, చెక్కలు, గులాబ్ జామ్, దోసలు, తాళింపు అన్నం.. పల్లెంలో పెట్టి వడ్డించేస్తుంటే , అమ్మ చేతి వంట గుర్తుకువచ్చేసింది అంటే నమ్మండి..

ఆ  గులాబ్ జామ్ అయితే పొరలు పొరలుగా విడిపోతూ, మృదువుగా, నోట్లో వేసుకోగానే కరిగిపోతూ.... ఎంత బాగుందో.... ప్రపంచంలో ఏ గృహిణి  నా లావణ్య లా గులాబ్ జామ్లు తయారుచేయగలదు.


వంట చేయడం మాత్రమే కాదు వడ్డించడం కూడా చాలా ముఖ్యమైన పనే.. లావణ్య ఆప్యాయతతో, ప్రేమతో కావలసినంత వడ్డించడం, మరికొంచెం వేసుకోండి ఫర్లేదు అని మారు వడ్డన చేయడం, అంత  ఆప్యాయంగా అడిగిన తర్వాత కూడా మరికొంచెం వడ్డించుకోకుండా ఎవరు ఉంటారు చెప్పండి... 


ఇంకో  నాల్రోజులు నీ చేతి వంట తింటే లావయిపోతాన ని భయం వేసి బెంగుళూరు బయలుదేరి వచ్చేసా.

 

భర్త కోసం టిఫిన్లు పెట్టి, లంచ్ బాక్సులు కట్టి, నీళ్లు వగైరా పెట్టి, నాప్కిన్ మర్చిపోకుండా పెట్టి వాళ్ళను పంపేశాక కాస్త ఊపిరి పీల్చుకుంటారు భార్యలు ... ఈ సన్నివేశం నిన్న నేను లైవ్లో లావణ్యలో చూసాను. 


నీ వంట మీద సరదాగా ఒక చిన్న కవిత:



నీ చేతి వంట, మాడినా నేను తింటా

మరలా వండనా అని అడిగావు ఓరకంట

అందుకే నాకు ఈ కడుపు మంట 

ఎందుకలా చూస్తావంటా, తినకపోతేనే తంటా  

అందుకే తింటాను మారు మాట్లాడకుండా.. 

 

ఇది వ్రాసింది సరదాకేనంట:)

 
 

--------------- ‘‘అన్నదాతా సుఖీభవ!’’ -----------------




Friday, October 17, 2014

వస్తున్నా నీకోసం...!!


నీ నవ్వు జ్ఞాపకం నన్ను నీ వైపు నడిపిస్తుంది 

గుప్పెడు గుండెలోని ఈ చిన్ని ఆశ  నిను చేరితే గాని తీరదు... 



నువ్వు నాకు గుర్తొస్తే ఎవరూ ఉండరు, నీ జ్ఞాపకం తప్ప!


నీ చెంత చేరాలని చక్రాల బండిలో(వోల్వో  బస్సు) పరిగెడుతున్న,
నా వడి వడి ఆశలే చక్రాలు  అయి, ఇష్టాలే ఇంజిన్ అయి, బాధలనే బ్రిడ్జిలను దాటుతూ  వస్తున్నాకేవలం నీకోసం... !!!

 

నీ ఒడిలో నీమోమునుచూస్తూ నీతో ఊసులు చెప్పుకోవడానికి వస్తున్నానీకోసం... !!!

 

మాటలు అయితే రావడం లేదు కాని భావం అయితే బోలెడుంది... 

నేను ఇంకా నిన్ను చేరలేదు కాని నా మనసైతే ఏనాడో నినుచేరింది... 


Thursday, October 16, 2014

ప్రేమ అంటే మాయ అంటారు ఇదేనేమో...!!

ఈ ప్రేమ చాల విచిత్రమైనది ఎందుకంటే కలసి ఉన్నపుడు కనబడదు కనుమరుగయ్యాక మాత్రం కన్నీటి కధనాన్ని నడిపిస్తుంది. ప్రేమ వున్న చోట ద్వేషమూ పుడతాయట..! ఆ ద్వేషం వల్లే మనజంట విడిపోయినా మరల మనల్ని కలిపింది ఈ ప్రేమేగా... జీవితంలో ముఖ్య ఘట్టం  పెళ్లి. నచ్చిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలనే సిద్ధాంతం ప్రేమికులది..ఆ సిద్ధాంతంని నా జీవితంలో నిజం చేసింది నువ్వేగా... ఆంతు తెలియని ఈ జీవితం లో అందమైన మలుపు నువ్వుయ్యావు... 



ఆనుక్షణము నీ సమక్షంలో ఆనందమే నా గుండెల్లో

పెళ్లిళ్లు  స్వర్గంలో నిర్ణయమవుతాయట కాని మన  ప్రేమ పుట్టుక  కూడా అక్కడే  నిర్ణయించేసాడు దేవుడు ... 

 

లావణ్య నేను పుట్టిన వెంటనే ఏడ్చింది నువ్వు కావాలనేమో , నిన్ను పలకరించాడానికే నేను మాటలు నేర్చానేమో, నా మనసులోని భావాలను ఇలా వ్రాయడానికే వ్రాత నేర్చానేమో... 

 

నా లావణ్య  నా జీవితంలోకి ఒక పండగలా వచ్చింది ... నవ్వుల్ని నింపింది .. నేస్తం అయ్యింది ...సమస్తం అయ్యింది...

 

ఏది ఏమయినా 

 

నన్ను పుట్టించిన ఆ  బ్రహ్మకు... 

నన్ను నవమాసాలు మోసి,కని,పెంచిన మా అమ్మకు... 

నన్ను ఇంత ఆనందానికి గురిచేసిన ఈ కుందనపు బొమ్మ(నా లావణ్య)కు ఆజన్మాంతం రుణపడి ఉంటాను...