నా మంచు 'ముత్యం' నువ్వే కదా..
శుభోదయం రా బుజ్జి తల్లి ( నా గారాల పట్టి)...
ఈ రోజు ఉదయాన్నే లేచాను , ప్రకృతి అందాలను ఆస్వాదించి చాలా రోజులు అయ్యింది(అంటే వేరే అందాలను ఆస్వాదించడంలో కొంచెం బిజీ గా ఉన్నాలే ;) ) కదా అని నేనేదో అలా మంచులో వాకింగ్ కి వెళ్తే అక్కడ కూడా నా మనసుకి కష్టాలే...
ఇంతకి నాకు వచ్చిన కష్టం ఏంటి అంటే నీ ఊహలే నన్ను ఆ పొగ మంచుల్లో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి...
మంచులో అలా నడుస్తూ ఉంటే, వేసే ప్రతి అడుగులో నువ్వే గుర్తుకువస్తున్నావ్ రా పిచ్చి...
|
మంచు ముసుగు |
అంతటి మంచులో నా శరీరంలో కలుగుతున్న చల్లదనం కన్నా, నిన్ను నా మనసులో ఊహించుకోవడం వల్ల కలిగిన వెచ్చదనమే చాలా హాయిగా ఉంది , చలి లో చలిమంట కాచుకున్నట్లుగా ... అలా మంచుదారుల్లో నడిచా, నీ ఊహలే శ్వాసగా మంచు ముత్యం లాంటి నీ మనసే నాకు తోడుగా ..!
నీ ఉహలతో ఉలిక్కిపడిన హృదయాన్ని ఓదార్చేలోపే తెలవారి పోయింది ఈ ఉదయం... అప్పుడు అనిపించింది జీవితం ఒక విచిత్రం లాంటిది అని...
మరొక విషయం ఏంటి అంటే ఈరోజు నా అలారం కన్నా నేనే ముందు లేచానోచ్చ్.. ఏంటి ఈ విషయం కూడా ఇప్పుడు నాకు చెప్పాలా అని నీకు అనిపించవచ్చు , కాని ఇలాంటి చిన్న చిన్న ఆనందాలని కూడా మిస్ చేసుకోకూడదు కదా...
MISS YOU MY DEAR.
No comments:
Post a Comment