Monday, October 20, 2014

నీ చేతి వంట అమృతమే..


‘ఇరుకైన’ ఈ వంట గది(నా హృదయపు) లో .. నువ్వు చూపించిన ఆప్యాయతకు(రుచి) చోటేది ప్రియా .

 

వంట చేయడమనేది ఒకకళ, మన సంస్కృతి. అగ్ని ముందే నిలబడి గంటలు తరబడి వంటలు  చేయడం ఒక యజ్ఞం లాంటిది. ఆ యజ్ఞమ్ ని పూర్తి చేసి, నా మనసును దోచుకున్నావ్ గా... !!!

 

కూరగాయలు తరగాలంటే నెయిల్ పాలిష్ ఊడిపోతుంది,  నీళ్లల్లో ఎక్కువసేపు పని చేస్తే  నా చేతులు మృదువుగా ఉండవు, స్టవ్ దగ్గర ఎక్కువ సేపుంటే ఆ వేడికి నా ముఖ చర్మం కమిలిపోయి పాడయిపోతుంది అని ఆలోచించే అమ్మాయిలు ఉన్న ఈరోజుల్లో ఇలాంటివి ఏవి ఆలోచించకుండా నా ఇష్టాలను, మనసుని  తెలుసుకుని నీ ప్రేమనీ, మమతనీ రంగరించి వండిన నీ  చేతి వంట నాకొక  ప్రత్యేకం, అపురూపం. మంచి వంటలు ఉంటాయి, గొప్ప వంటలుంటాయి కానీ కమ్మటి వంట మాత్రం ఖచ్చితంగా నీ  చేతి వంటే.

 
నా భార్య స్వయంగా తయారు చేసింది

లావణ్య చేసిన  రక రకాల  వంటకాలు అంటే పూరిలు, మైసూరు బోండాలు, చెక్కలు, గులాబ్ జామ్, దోసలు, తాళింపు అన్నం.. పల్లెంలో పెట్టి వడ్డించేస్తుంటే , అమ్మ చేతి వంట గుర్తుకువచ్చేసింది అంటే నమ్మండి..

ఆ  గులాబ్ జామ్ అయితే పొరలు పొరలుగా విడిపోతూ, మృదువుగా, నోట్లో వేసుకోగానే కరిగిపోతూ.... ఎంత బాగుందో.... ప్రపంచంలో ఏ గృహిణి  నా లావణ్య లా గులాబ్ జామ్లు తయారుచేయగలదు.


వంట చేయడం మాత్రమే కాదు వడ్డించడం కూడా చాలా ముఖ్యమైన పనే.. లావణ్య ఆప్యాయతతో, ప్రేమతో కావలసినంత వడ్డించడం, మరికొంచెం వేసుకోండి ఫర్లేదు అని మారు వడ్డన చేయడం, అంత  ఆప్యాయంగా అడిగిన తర్వాత కూడా మరికొంచెం వడ్డించుకోకుండా ఎవరు ఉంటారు చెప్పండి... 


ఇంకో  నాల్రోజులు నీ చేతి వంట తింటే లావయిపోతాన ని భయం వేసి బెంగుళూరు బయలుదేరి వచ్చేసా.

 

భర్త కోసం టిఫిన్లు పెట్టి, లంచ్ బాక్సులు కట్టి, నీళ్లు వగైరా పెట్టి, నాప్కిన్ మర్చిపోకుండా పెట్టి వాళ్ళను పంపేశాక కాస్త ఊపిరి పీల్చుకుంటారు భార్యలు ... ఈ సన్నివేశం నిన్న నేను లైవ్లో లావణ్యలో చూసాను. 


నీ వంట మీద సరదాగా ఒక చిన్న కవిత:



నీ చేతి వంట, మాడినా నేను తింటా

మరలా వండనా అని అడిగావు ఓరకంట

అందుకే నాకు ఈ కడుపు మంట 

ఎందుకలా చూస్తావంటా, తినకపోతేనే తంటా  

అందుకే తింటాను మారు మాట్లాడకుండా.. 

 

ఇది వ్రాసింది సరదాకేనంట:)

 
 

--------------- ‘‘అన్నదాతా సుఖీభవ!’’ -----------------




No comments:

Post a Comment